లేడీ డైరెక్టర్ కి కాలం కలిసి వచ్చి మంచి శకునం మొదలయ్యేనా?

2011 సంవత్సరంలో అలా మొదలైంది అంటూ దర్శకురాలిగా కెరీర్ ను ప్రారంభించిన నందిని రెడ్డి( Nandini Reddy ) మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా సాధించిన విజయంతో ఆ వెంటనే జబర్దస్త్‌ అనే సినిమాను చేసే అవకాశం దక్కించుకుంది.

కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.సిద్దు( Siddhu ) మరియు సామ్( Sam ) కలిసి ఆ సినిమా లో నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా ఫ్లాప్ నుండి బయట పడటానికి మూడు సంవత్సరాలు పట్టింది.ఆ తర్వాత కళ్యాణ వైభోగమే అనే సినిమా ను చేసిన విషయం తెల్సిందే.

ఆ సినిమా కూడా డిజాస్టర్‌ గా నిలిచింది.దాంతో మళ్లీ మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సమంత తో ఓ బేబీ అనే సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే.

పిట్ట కథలు అనే సిరీస్ కు ఒక ఎపిసోడ్‌ కి దర్శకత్వం వహించింది.

అన్ని మంచి శకునములే( Anni Manchi Shakunamule ) సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తో మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

"""/" / ఈ సినిమా లో సంతోష్ శోభన్ హీరోగా నటించగా మాళవిక నాయర్( Malvika Nair ) హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.హీరోగా సంతోష్‌ శోభన్ హీరో గా వరుసగా సినిమా లు చేస్తూ దూసుకు పోతున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తో ఆయనకు ఎలాంటి ఫలితం దక్కుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు మహానటి ఫేం స్వప్న సినిమాస్‌ వారు నిర్మించారు.

తాజాగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.సినిమా పై చాలా పాజిటివ్ గా ఉన్నారు.

అన్ని విధాలుగా ఈ సినిమాకు మంచి శకునములు కనిపిస్తున్నాయి.కనుక నందిని రెడ్డికి అన్ని మంచి శకునాలే అయ్యి ఉండవచ్చు అంటూ ఆమె సన్నిహితులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కీళ్ల నొప్పుల‌కు కార‌ణాలేంటి.. వాటి నుండి రిలీఫ్ ఎలా పొందాలి?