ఓటమిని ఒప్పుకున్న దర్శకురాలు.. ఈసారి అలా జరగకుండా చూస్తా

ఓటమిని ఒప్పుకున్న దర్శకురాలు ఈసారి అలా జరగకుండా చూస్తా

అలా మొదలైంది అంటూ కెరీర్ ను ఆరంభించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి.

ఓటమిని ఒప్పుకున్న దర్శకురాలు ఈసారి అలా జరగకుండా చూస్తా

టాలీవుడ్ లో దర్శకులు అనగానే మగవారే ఎక్కువ మంది గుర్తుకు వస్తారు.లేడీ దర్శకులు చాలా తక్కువ మంది మాత్రమే.

ఓటమిని ఒప్పుకున్న దర్శకురాలు ఈసారి అలా జరగకుండా చూస్తా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుంచుకోదగ్గ దర్శకులు విజయ నిర్మల.జయ.

నందిని రెడ్డి.ఈ ముగ్గురు తెలుగు సినిమా ల్లో తమదైన ముద్ర వేశారు.

తాజాగా నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంతోష్‌ శోభన్( Santosh Sobhan ) హీరోగా రూపొందిన ఆ సినిమాకు సంబంధించిన టాక్ పట్ల యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ను చాలా కష్టపడి రూపొందించారు.అంతే కష్టపడి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

అయినా కూడా ఫలితం ఆశించిన స్థాయి లో లేదు.దాంతో యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అలా మొదలైంది తర్వాత ఆ స్థాయి కమర్షియల్ సక్సెస్ ని నందిని రెడ్డి( Nandini Reddy ) దక్కించుకోవడం లో విఫలం అయ్యింది.

గత కొంత కాలంగా నిరాశ పర్చుతూనే ఉన్న నందిని రెడ్డి ఈ సినిమా తో సక్సెస్ ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.

కానీ నందిని రెడ్డి మాత్రం మరో పరాజయం ను మూట కట్టుకుంది.ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

/br> """/" / సోషల్‌ మీడియాలో నందిని రెడ్డి సినిమా ఫలితంపై స్పందించింది.

సినిమా సక్సెస్ కాకపోవడం పట్ల తప్పు తనదే అన్నట్లుగా చెప్పుకొచ్చింది.రైటింగ్‌ విషయంలో ఇంకాస్త మెరుగ్గా ఆలోచించాల్సి ఉంది.

ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.ముందు ముందు అయినా తప్పు జరగకుండా చూసుకుంటాను అంటూ నందిని రెడ్డి చాలా హుందాగా ప్రకటించడం అభినందనీయం.

త్వరలో సమంత హీరోయిన్ గా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) కీలక పాత్రలో నందిని రెడ్డి ఒక సినిమా ను చేసేందుకు రెడీ అవుతోంది.

చంపుతామని బెదిరిస్తున్నారు… సింగర్ సునీత వల్లే ఇదంతా: ప్రవస్తి