నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఏపీలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే 2019 కంటే 2024 ఎన్నికలు( 2024 Elections ) చాలా రసవతారంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా బరిలోకి దిగనుంది.

మరోపక్క జనసేన( Janasena ).టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేయబోతున్నాయి.

2014 మాదిరిగా 2024 ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నాయి.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై చర్చలు జరుగుతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే జరగబోయే ఎన్నికలలో నందికొట్కూరు నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయసూర్య( Jayasurya ) పోటీ చేస్తారని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మాండ్ర శివారెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఇదే సమయంలో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కష్టపడాలని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.

అనేక పరిశ్రమలు వస్తాయని మాండ్ర శివారెడ్డి( Mandra Sivananda Redd ) స్పీచ్ ఇవ్వడం జరిగింది.

మిడుతూరులో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో జయసూర్య గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

కానీ దీనిపై టీడీపీ అధిష్టానం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

సూర్య భయ్యా, నువ్వు సూపర్.. రహానే సెంచరీ కోసం ఇంత త్యాగమా..?