మనసులను కదిలిస్తున్న తారకరత్న చివరి ప్రేమలేఖ.. ఎమోషనల్ అయిన అలేఖ్య?
TeluguStop.com
నందమూరి యంగ్ హీరో గత నెల ఫిబ్రవరి 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కుటుంబ సభ్యులు.అయితే ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ విషాదం నుంచి ఇంకా బయటపడలేదు.చనిపోయాడు అన్న వార్త కల అయితే బాగుంటుంది అని కుటుంబ సభ్యులు అభిమానులు కూడా అనుకుంటున్నారు.
మరి ముఖ్యంగా తారకరత్న మరణాన్ని ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతోంది.కడవరకు తోడుంటానని ప్రమాణం చేసి మూడు ముళ్ళు వేసిన భర్త ఇలా అర్ధాంతరంగా తనవి చాలించడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
అయితే అలేఖ్య రెడ్డిని కుటుంబ సభ్యులు ఎంతగా ఓదారుస్తున్నప్పటికీ ఆమె మాత్రం భర్త జ్ఞాపకాల నుంచి ఆ మరణ వార్త విషయం నుంచి బయటపడలేకపోతోంది.
భర్తతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతోంది.తన భర్త చిన్నకర్మ రోజున ఎమోషనల్ అవుతూ ఆమె ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తర్వాత ఆమె తన భర్తతో కలిసి దిగిన చివరి ఫోటో అంటూ ఒక ఫోటోని కూడా షేర్ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె వాలంటైన్స్‌డే సందర్భంగా తారకరత్న తనకు రాసిన ప్రేమలేఖను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అలాగే తారకరత్నకు ముద్దు పెడుతున్న ఫొటోను కూడా షేర్ చేసింది.కాగా లెటర్‌లో అలేఖ్య పై తనకున్న ప్రేమకు అక్షర రూపమిస్తూ తారకరత్న రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.
"""/" /
ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నువ్వంటేనే ఎక్కువ నాకు ఇష్టం.నా కన్నా నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను.
కొన్ని సార్లు నిన్ను బాధ పెట్టి ఉండచ్చు.అయినా అన్నింటినీ భరించి నన్ను ప్రేమించావు.
కిష్ట సమయాల్లో నాకు అండగా ఉన్నావు.నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
నా లైఫ్‌లో నాకున్న ఒకే ఒక ప్రపంచం నువ్వే బంగారు.హ్యాపీ వాలంటైన్స్ డే.
లవ్యూ సో మచ్ బంగారం. """/" /
మన జీవితంలో అన్ని రకాల కష్ట సుఖాలు చూశాం.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.జీవితంలో అత్యంత కష్టకాలం అనుభవించాం.
మన కష్టాలు మనకు మాత్రమే తెలుసు.మంచి రోజుల కోసం చాలా ఎదురు చూశాం.
మనిద్దరం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం.నీ జీవితంలో పడిన కష్టాలు ఎవరికీ తెలియదు.
నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు.నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా అంటూ తారకరత్న రాసిన మాటలు అందరి మనసులను కదిలిస్తున్నాయి.
ఈ లేఖనే సోషల్ మీడియాలో షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు