ఊపిరి పీల్చుకుంటున్న నందమూరి ఫ్యాన్స్.. మా బాబు తగ్గాడోచ్‌

నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు తెలుగు సినీ ప్రేక్షకులు ఒక విషయం లో ఊపిరి పీల్చుకుంటున్నారు.

ముఖ్యంగా బాలయ్యను దేవుడిగా అభిమానించే అభిమానులు ఇప్పుడు గుండెల మీద భారం దిగిపోయినంత ఆనందంతో ఉన్నారు.

అందుకు కారణం నిన్న మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఒక ఫోటో.

నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ కి బర్త్డే కేక్ తినిపిస్తున్నాడు.అందులో మోక్షజ్ఞ ని చూసిన తర్వాత నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత మూడు నాలుగు సంవత్సరాలుగా నందమూరి మోక్షజ్ఞ లుక్ చూడడానికే అభిమానులు ఒకింత భయపడ్డారు.

భారీ కాయంతో ఆయన మరీ ఎక్కువ లావుగా ఉన్నాడు అంటూ విమర్శలు వచ్చాయి.

నందమూరి అభిమానులు కూడా విషయంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉండే వారు.కానీ ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లో అడుగు పెట్టడం కోసం అన్నట్లుగా చాలా బరువు తగ్గాడు.

మరికొన్ని రోజుల్లో ఇంకా బరువు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.మోక్షజ్ఞ బరువు తగ్గడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నేడు కాదంటే రేపు అయినా కూడా ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు ఆనందంతో ఉన్నారు.

ఇదే సమయంలో ఆయన ఇండస్ట్రీని ఏలా బోతున్నాడంటూ నందమూరి అభిమానులు ధీమా తో ఉన్నారు.

తప్పకుండా నందమూరి ఫ్యామిలీ యొక్క సక్సెస్‌ ప్రస్థానం మోక్షజ్ఞ తో కూడా కంటిన్యూ అవుతుందని ఎన్టీఆర్ కి పోటీ అన్నట్లుగా మోక్షజ్ఞ సినిమాలు నిలుస్తాయి అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు.

మొత్తానికి నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో రావడం అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయింది.

దాంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ మా బాబు తగ్గాడోచ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు.

వైరల్ : బతకాలని లేనట్లుంది.. ఏకంగా 300 మొసళ్లున్న సరుసులోకి వెళ్లి?