నందమూరి కళ్యాణ్ రామ్ మరో 'బింబిసార' రేంజ్ సక్సెస్ దక్కించుకుంటాడా?

నందమూరి కళ్యాణ్ రామ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయ్యింది.ఈ రెండు దశాబ్దాల్లో ఆయన దక్కించుకున్న సూపర్ హిట్స్ కేవలం రెండు మాత్రమే.

ఇటీవల వచ్చిన బింబిసార సినిమా తో కెరీర్‌ ను మరి కొన్నాళ్ల పాటు ఈయన కంటిన్యూ చేసే అవకాశం దక్కింది.

అయితే ఈయన నటించిన అమిగోస్ సినిమా బింబిసార ను మించి ఉంటుంది అంటూ ఆయన సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్ తో అమిగోస్ సినిమా చిన్న సినిమా ల్లో పెద్ద సినిమా గా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.వచ్చే నెలలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఇటీవల వచ్చిన టీజర్ తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. """/"/ అసలు కళ్యాణ్ రామ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో ఎలా నటిస్తున్నాడు.

ఎలా ఆయన పాత్రలు ఉంటాయి అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో కళ్యాణ్ రామ్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

కళ్యాణ్ రామ్‌ యొక్క లుక్ విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.రికార్డు బ్రేకింగ్‌ తో బింబిసార """/"/ వసూళ్లు సాధించినట్లుగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే విధంగా కళ్యాణ్‌ రామ్‌ సినిమా ఉంటుందని అమిగోస్‌ మేకర్స్ అంటున్నారు.

మరి ఆ స్థాయి లో సక్సెస్ దక్కేనా అనేది చూడాలి.కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా తో కూడా త్వరలో రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

ఈ రెండు సినిమా లు ఆయన కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.