కళ్యాణ్ రామ్‌ కి డెవిల్ కి ‘సలార్‌’ భయం లేదా?

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్థాయి సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ప్రభాస్ సలార్ మరియు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకీ( Dunki Movie ) చిత్రాలు వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలు క్రిస్మస్ కానుకగా ఇండియన్ బాక్సాఫీస్ వద్దకి రాబోతున్నాయి.కచ్చితంగా ఈ రెండు సినిమా లు కూడా బాక్సాఫీస్( Box Office ) ని షేక్‌ చేస్తాయి అంటూ అభిమానులు నమ్మకం తో ఉన్నారు.

"""/" / అందుకే ఆ రెండు సినిమా లకు వారం ముందే అంత సైడ్ ఇచ్చేశారు.

ఇక ఆ సినిమా లు విడుదలైన తర్వాత కనీసం రెండు మూడు వారాల వరకు పెద్ద సినిమా రాకపోతేనే బెటర్ అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఆ రెండు సినిమాలు విడుదలైన వారం రోజుల్లోనే నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram )నటించిన డెవిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా లో కళ్యాణ్ రామ్ పిరియాడిక్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

"""/" / సినిమా ని దాదాపు 50 కోట్ల బడ్జెట్తో నిర్మించినట్లుగా సమాచారం అందుతుంది.

అంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ను తీవ్రమైన పోటీ ఉన్న సమయం లో విడుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ మరియు డంకీ సినిమా లు కచ్చితంగా డెవిల్ సినిమా( Devil Movie ) కు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు.

అయినా నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు తప్పితే మరో సమయం లేదు అన్నట్లుగా డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

డిసెంబర్ 29 వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా లో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించిన విషయం తెలిసిందే.

అభిషేక్ నామ స్వీయ దర్శకత్వం లో ఈ సినిమా ను నిర్మించాడు.

చీర కట్టుకుని గాజులు వేసుకుని సీతలా నటించాను.. రవి కిషన్ కామెంట్స్ వైరల్!