డెవిల్ సెన్సార్ టాక్.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా?

టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం డెవిల్.ఇందులో సంయుక్తా మీనన్ అలాగే మాళవిక నాయర్ లు హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించారు.

కాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇకపోతే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ప్రేక్షకుల నుంచి ఈ టైలర్ కు పాజిటివ్ స్పందన లభించింది.పీరియాడిక్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేసింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికేట్‌ను పొందింది.

2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.సెన్సార్ నుండి సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో యూనిట్ అంతా హ్యాపీగా ఉంది.

"""/" / కాగా హీరో కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయట.

దీంతో పాటు డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ని అలరించనున్నాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు.

దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ ఒక రేంజ్‌లో మెప్పించనున్నాయి.

మొత్తానికి ఈ సినిమాకు వస్తున్న టాక్ ని బట్టి చూస్తే కళ్యాణ్ రామ్ కెరియర్ లో మరొక బ్లాక్ మాస్టర్ హిట్ సినిమా పడ్డట్టే అని తెలుస్తోంది.

భర్తను వీర బాదుడు బాదిన భార్య.. ఈ ఫన్నీ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకోండి..