నందమూరి కళ్యాణ్‌ రామ్ సినిమా 'బింబిసారా' గురించి శోధనలు

నేడు నందమూరి కళ్యాణ్ రామ్‌ తన 18వ సినిమా టైటిల్‌ మరియు కాన్సెప్ట్‌ ను అధికారికంగా ప్రకటించాడు.

ఈ సినిమాకు బింబిసార అనే టైటిల్‌ ను ఖరారు చేశాడు.కళ్యాణ్ రామ్‌ సినిమాల పట్ల స్వయంగా నందమూరి అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు.

కాని బింబిసార అంటే ఏంటా అంటూ అంతా ఆసక్తిగా గూగుల్ చేస్తున్నారు.సెర్చింగ్‌ లో బింబిసార అంటే రకరకాలుగా అర్థాలు వస్తున్నాయి.

కొన్ని రకాల మనుషులు కూడా వస్తున్నారు.గూగుల్‌ లో చెబుతున్నది అంతా కూడా నమ్మడానికి లేదు.

ఏది ఏంటీ అనే విషయంపై కొందరు జుట్టు పీక్కుంటున్నారు.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

బింబిసార అంటే ఒక రాజు.చరిత్ర లో కనిపించకుండా పోయిన ఆయన గురించి జనాలకు తెలియజేసే ఉద్దేశ్యంతో కళ్యాణ్ రామ్‌ ఈ సినిమా ను కాస్త ఎక్కువ బడ్జెట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

భారీ బడ్జెట్‌ సినిమా లు కళ్యాణ్‌ రామ్‌ కు కొత్తేం కాదు.కాని ఇది అంతకు మించి అన్నట్లుగా కూడా కామెంట్స్ వినిపస్తున్నాయి.

ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌ చేసిన కథ వేరు.ఇప్పుడు కళ్యాణ్ రామ్‌ చేస్తున్న కథ వేరు అంటూ చాలా మంది బలంగా నమ్మకంగా చెబుతున్నారు.

కథ విషయంలో చాలా పరిశోధన చేసి ఆ తర్వాత స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి తదుపరి షూటింగ్‌ కు వెళ్లాలనుకున్నారు.

షూటింగ్‌ కు వెళ్లాలనుకున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది.

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం అవుతుందని కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు.బింబిసారా టైటిల్‌ కాస్త విభిన్నంగా ఉండటంతో పాటు కళ్యాణ్ రామ్‌ లుక్ సినిమా పై ఎప్పుడు లేనిది ఆసక్తి పెరుగుతుంది.

కళ్యాణ్‌ రామ్‌ కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా ఇలాంటి పాత్రలు కాని సినిమాలు కాని చేసింది లేదు.

ఆయన 17 సినిమాల్లో సక్సెస్‌ అయిన సినిమా లు రెండే రెండు.15 ప్లాప్‌ లు పడ్డా కూడా బింబిసార తో సక్సెస్‌ ను దక్కించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

Hebah Patel Latest Images-ఎద అందాలతో కుర్రకారును పారేశాను చేస్తున్న..హెబ్బా పటేల్