మెగా హీరోలకు పోటీగా నందమూరి హీరోలు… లెక్క పెరుగుతుందిగా!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా హీరోలదే( Mega Heroes ) హవా అని చెప్పుకోక తప్పదు.

ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండి దాదాపుగా అరా డజన్ మంది హీరోలు ఉన్నారు కాబట్టి.

ఇక వారి చుట్టూనే ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

అందులో ముగ్గురు సూపర్ స్టార్ లు కాగా, మరో ముగ్గురు మీడియం బడ్జెట్ హీరోలు.

కథల ఎంపికల విషయంలో మెగా హీరోలదే పైచేయిగా కనబడుతుంది.ఆ తరువాతే మిగతా హీరోల లిస్టు వస్తుందనేది నిర్వివాదాంశం.

"""/" / ఇక మెగా ఫ్యామిలీ తర్వాత చెప్పుకోదగ్గది నందమూరి ఫ్యామిలీ.ఈ ఫ్యామిలీలో ఇప్పటికే ముగ్గురు హీరోలు తమ హవా చాటుకుంటున్నారు.

ఇక వారు చాలదన్నట్టు మరో ఇద్దరు హీరోలు రంగ ప్రవేశం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు.

వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) కాగా, మరో హీరో నందమూరి జానకిరామ్ తనయుడు.

మోక్షజ్ఞ ఎంట్రీ మామూలుగా ఉండదని చెబుతున్నారు టాలీవుడ్ వర్గాలు.ఇక జానకిరామ్ తనయుడు తాజాగా దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాకి తయారైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

"""/" / ఇక బాలకృష్ణ( Balakrishna ) వారసుడు నందమూరి వంశానికి అసలు సిసలైన వారసుడిగా ప్రకటించుకుంటున్నారు.

ఆ విషయం పక్కన పెడితే, టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ భారీ స్థాయిలో చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

దాంతో ఇప్పుడు మొత్తంగా దగ్గర దగ్గరగా, నందమూరి హీరోలు( Nandamuri Heroes ) కూడా అరడజనకు చేరుకోవడంతో మెగా ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పరిగెడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

రాబోయే రోజుల్లో మెగా వర్సెస్ నందమూరి అన్న మాదిరి సినిమాలు రిలీజ్ అయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

అయితే నందమూరి హీరోలతో పోల్చుకుంటే ఒకరిద్దరు మెగా హీరోల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడ గుర్తించవచ్చు.

ఎందుకంటే, రానున్న రెండు మూడు సంవత్సరాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మెగావర్గాలు కోడై కోస్తున్నాయి.

హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు