ఇండియా వదిలి వెళ్లిపోవాలని కొడుకుకు చెప్పిన హరికృష్ణ.. అప్పట్లో ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు నందమూరి హీరో హరికృష్ణ( Hari Krishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు తెలుగులో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సీతయ్య లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

ఇది ఇలా ఉండే తాజాగా సోషల్ మీడియాలో హరికృష్ణకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే హరికృష్ణ హీరోగా నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా సమయంలో ఈ సినిమా విషయంలో హరికృష్ణకు అలాగే తనయుడు కళ్యాణ్ రామ్ కీ( Kalyan Ram ) మధ్య పెద్ద గొడవే జరిగిందట.

ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.

అప్పుడే నేను కోయం బత్తూర్ లో నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చాను.

నాకు నిర్మాత వైవిఎస్ చౌదరి( YVS Chowdary ) చాలా మంచి స్నేహితుడు, ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చి ఒక కథ ఉంది వింటారా అని అడిగినప్పుడు సరే వింటాను చెప్పు అని అన్నాను.

అప్పుడు కథ మొత్తం వినిపించి ఈ లాహిరి లాహిరి లాహిరిలో( Lahiri Lahiri Lahirilo ) సినిమా కథను నాన్న కోసం రాశాను అని చెప్పగా అప్పుడు కళ్యాణ్ రామ్ ఆ కథ గురించి హరికృష్ణకు చెప్పి సినిమాలో నటించమని అడిగారట.

కానీ అప్పుడు హరికృష్ణ సినిమాలు చేసే మూడ్లో లేరట.దానికి తోడు ఆ సినిమా కథ విషయంలో కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయట.

"""/" / అలాగే నిర్మాత వైవిఎస్ చౌదరి స్వయంగా ఆ సినిమాను నిర్మిస్తాను అన్నారట.

అందుకు హరికృష్ణ ఒప్పుకోలేదట.ఒకరోజు కళ్యాణ్ రామ్ నేరుగా హరికృష్ణ వద్దకు వెళ్లి మీకు చౌదరి మీద అనుమానం ఉంది కదా ఈ సినిమా నేను నిర్మిస్తాను.

నేను నిర్మాతగా వ్యవహరిస్తాను అని చెప్పడంతో హరికృష్ణ భయపడ్డారట.ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు.

చిన్న విషయం చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారని హరికృష్ణ కళ్యాణ్ రామ్ పై కోపడ్డారట.

అంతేకాకుండా వారిద్దరూ కొద్దిరోజులు మాట్లాడుకోలేదట దూరంగానే ఉన్నారట. """/" / కొద్దిరోజుల తర్వాత ఆ కళ్యాణ్ రామ్ వద్దకు హరికృష్ణ వచ్చి నేను ఈ సినిమా చేస్తాను కాకపోతే ఒక కండిషన్ నువ్వు ఇండియాలో ఉండకూడదు అని చెప్పడంతో అప్పుడు కళ్యాణ్ రామ్ దేశాలకు వెళ్లి అక్కడ చదువు పూర్తి చేసే కొద్ది రోజులు జాబ్ కూడా చేశారట.

ఆ తర్వాత ఒకరోజు కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకిరామ్ ( Janakiram ) ఫోన్ చేసి నీకు సినిమాలపై ఆసక్తి ఉంది కదా మరి సినిమాలలో ఎందుకు నటించకూడదు అని అన్నారట.

అప్పుడు కళ్యాణ్ రామ్ వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి సినిమాలలో నటిస్తాను అని చెప్పడంతో కొడుకు చదువు పూర్తి అయిందని హరికృష్ణ కూడా అందుకు ఒప్పుకున్నారట.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : దూసుకెళ్తున్న కమలా హారిస్.. యువతను టార్గెట్ చేసిన ట్రంప్