చైతన్య కృష్ణ సరే మోక్షజ్ఞ ఎప్పుడు బాలయ్య?

Baనందమూరి ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.ముందు ముందు కూడా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అయితే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు అంటూ అభిమానులు పదే పదే ప్రశ్నిస్తున్నారు.

నేడు నందమూరి తారక రామారావు వందవ జయంతి సందర్బంగా ఆ ఫ్యామిలీ మొత్తం హడావుడిగా ఉంది.

వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగ జరుపుకుంటున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్‌ తన బింబిసార సినిమా యొక్క పోస్టర్ ను విడుదల చేశాడు.

బాలయ్య తన 107వ సినిమా యొక్క పోస్టర్ ను విడుదల చేశాడు.ఇక నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్‌ గురించి గుర్తు చేసుకున్నారు.

ఇదే సందర్బంగా నందమూరి ఫ్యామిలీకి చెందిన నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా బాలయ్య అధికారికంగా ప్రకటించాడు.

బసవతారకరామ అనే బ్యానర్‌ తో చైతన్య కృష్ణ హీరోగా ఒక సినిమా ను ప్రకటించారు.

గతంలోనే రెండు మూడు సినిమా లను చైతన్య కృష్ణ చేశాడు.ఇప్పుడు ఆయన మరో సినిమాకు సిద్దం అయ్యాడు.

గతంలోనే చైతన్య కృష్ణ నుండి సినిమా లు సరిగ్గా రాకపోవడంతో ఆయన మళ్లీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టక పోవడం మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాని ఆయన మాత్రం ఇండస్ట్రీ లో ఉన్న తన వారి సహకారంతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

బాబాయి బాలయ్య చేతుల మీదుగా చైతన్య కృష్ణ మళ్లీ లాంచ్ అవ్వబోతున్నాడు.అన్నయ్య కొడుకు చైతన్య కృష్ణ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్న బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ను ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నాడు.

అందుకు బాలయ్య సమాధానం చెప్పాలి.ఎన్టీఆర్‌ 100వ జయంతికి మించిన మంచి రోజు లేదు.

కనుక మోక్షజ్ఞ సినిమా ను ప్రకటిస్తే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రసన్నవదనం మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?