అఫిషియల్ : బాలయ్య సినిమాకు ముహూర్తం ఫిక్స్.. రూమర్స్ ను నిజం చేసారుగా!
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరో వైపు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
అఖండ సినిమా విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసి చివరి దశకు తీసుకు వచ్చాడు.
వీరసింహా రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించ డానికి రెడీ అవుతున్నాడు.
అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి బాలయ్య కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ రాబోతుంది అంటూ నిన్నటి నుండి ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ రూమర్స్ ను నిజం చేస్తూ తాజాగా అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది.
డిసెంబర్ 8న అంటే రేపు ఉదయం ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
అంతేకాదు రేపు ఉదయం 9 గంటల 36 నిముషాలకు ఈ సినిమా స్టార్ట్ కానున్నట్టు నిర్మాణ సంస్థ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
"""/"/
అయితే ఈ సినిమా టైటిల్ కూడా వస్తుంది అని రూమర్స్ వచ్చాయి కానీ టైటిల్ అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించలేదు.
కేవలం ముహూర్తం మాత్రమే ఫిక్స్ చేసి షూట్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమం రేపు హైదరాబాద్ లో జరగనుంది.
దీనికి ప్రముఖులు హాజరు కానున్నట్టు టాక్.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
రోజూ ఈ జ్యూస్ తాగండి.. నాజూగ్గా మారండి..!