కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్న బాలయ్య… ఆ సమస్య కారణమా?
TeluguStop.com
నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈయన నటించిన గత మూడు సినిమాలు ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించాయి.
తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సునామి సృష్టించింది.
ఇలా సినిమాల పరంగా బాలకృష్ణ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో నటించబోతున్న సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బాలయ్యకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
బాలయ్య ఉన్నఫలంగా కొత్త ఇంటికి ( New House ) షిఫ్ట్ అవ్వబోతున్నారని సమాచారం.
"""/" /
బాలకృష్ణ త్వరలోనే జూబ్లీహిల్స్ లో ఉంటున్నటువంటి మరొక ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నారని సమాచారం ప్రస్తుతం ఆ ఇంట్లో కొన్ని పనులు జరుగుతున్నాయని ఈ పనులు పూర్తికాగానే బాలకృష్ణ ఆ ఇంటికి షిఫ్ట్ కానున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఉన్నఫలంగా బాలయ్య ఇల్లు మారడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే బాలకృష్ణ కాస్త వాస్తుని(Vastu ) , తిథి,వారం నక్షత్రాలను, కూడా ఎక్కువగా నమ్ముతారనే విషయం మనకు తెలిసిందే.
ఆయనతో కలిసి జర్నీ చేసిన వారు బాలకృష్ణకు ఇలాంటి వాటిపై నమ్మకం ఎక్కువ అంటూ పలు సందర్భాలలో కూడా తెలియజేశారు.
"""/" /
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇంటిలో వాస్తు పరంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే బాలకృష్ణ ఉన్నఫలంగా ఇంటిని మార్చాలని భావించారట.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇంటికి ఈయన షిఫ్ట్ అవ్వబోతున్నారని సమాచారం.
ఇక ఈయన వృత్తిపరమైన విషయానికి వస్తే గత మూడు సినిమాలు కూడా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని అందుకున్నాయి.
బహుశా ఆయన వ్యక్తిగత కారణాలు లేదా రాజకీయ కారణాలవల్ల ఆ ఇంటిలో వాస్తుకు అనుగుణంగా లేకపోవచ్చని అందుకే బాలయ్య ఇల్లు మారుతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. .
మరోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్ అలీ.. అసలేం జరిగిందంటే?