దైవం జోలికొస్తే దవడ పగిలిపోద్ది.. అఖండలో డైలాగ్.. ఇన్ డైరెక్ట్ గా వారికి తగిలేలా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ.డిసెంబర్ 2న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.
సినిమా రిలీజ్ రెండు రోజులు అవుతున్నా కూడా థియేటర్ల వద్ద ఇంకా పండగ వాతావరణం కనిపిస్తోంది.
ఇక అఖండ సినిమాలో బాలయ్య అభిమానులు, ప్రజలు అతడిని దేవుడిలా భావిస్తుంటారు.బాలయ్య శివుడు గెటప్ లో తలకాయలు నరుకుతూ శివతాండవం చేస్తుండటంతో అది చూసిన అభిమానులు థియేటర్లలో ఈలలు, కేకలతో సంబరాలు చేసుకుంటున్నారు.
హౌస్ ఫుల్ కలెక్షన్లతో అఖండ విజయాన్ని అందించారు ప్రేక్షకులు.ఇక అఖండ సినిమాలో డైలాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇందులో డైలాగ్స్ ఆటం బాంబులు పేలుతున్నాయి.అందులో ముఖ్యంగా హిందూ ధర్మం గురించి.
హిందూ టెంపుల్స్ పరిరక్షణ గురించి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ డైలాగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ , వైసీపీ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతూ దేవాలయాలను పగలగొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడంలాంటివి చేస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
ఇక అందులోని విగ్రహాల ప్రాముఖ్యత అని తెలియజేస్తూ గట్టిగానే చురకలు వేశారు.
అఖండ సినిమాలో కొంతమంది ఆకతాయిలు ఊరి దేవాలయం లో కూర్చుని పేకాట ఆడుతూ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.
దీనితో శివుడి రూపం ఎత్తిన బాలయ్య ఎంట్రీ ఇచ్చి ఆ జులాయ్ బ్యాచ్ ని ఉతికి ఆరేస్తాడు.
"""/" /
దైవం జోలికి వస్తే దవడ పగిలిపోద్ది అంటూ.చేతిలో ఉన్న శూలాన్ని చూపించాడు బాలయ్య.
ఏంటి శూలం చూపిస్తున్నావు పొడుస్తావా అని బాలయ్యకి ఎదురువెళ్ళిన వ్యక్తి అనడంతో.శీలం లేని వాడిని పొడవడానికి శూలం ఎందుకురా గాడిద అంటూ బాలయ్య డైలాగ్ ను విసురుతాడు.
సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?