విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) సెట్‌లో నందమూరి బాలకృష్ణ
TeluguStop.com
విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ చిత్రం లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది.ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు.
విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలుచేస్తున్నారు.షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ముఖ్య అతిథి సెట్‌లోకి అడుగుపెట్టారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్‌కు వచ్చారు.గోవాకు దగ్గర్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుండటంతో లైగర్ సెట్‌లోకి వచ్చారు నందమూరి బాలకృష్ణ.
లైగర్ సెట్‌ను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు.సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు.
ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు.లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ టీంకు కంగ్రాట్స్ తెలిపారు నందమూరి బాలకృష్ణ.
మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ డ్రామా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు.విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.
కింగ్ చార్లెస్ 2025 న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్ .. 30 మంది భారతీయ ప్రముఖులకు చోటు