స్పీడ్ పెంచిన బాలయ్య ! ఇలాగే కొనసాగిస్తారా ?

హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొద్దిరోజులుగా స్పీడ్ పెంచారు.ముఖ్యంగా ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి బాలయ్య హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ సైతం ఇస్తున్నారు.సత్యసాయి జిల్లా గా ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంగా హిందూపురం కొనసాగించాలని, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు సైతం ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు.

  ఈ సందర్భంగా భారీ కాన్వాయ్ తో బాలయ్య వెళ్లడం వంటివి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచాయి.

అయితే బాలయ్య ఇదే స్పీడ్ ను ఇక కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.2019 ఎన్నికల తర్వాత నుంచి బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ పెద్దగా ఆ నియోజకవర్గంలో పర్యటించడం లేదు.

పీఏ ల ద్వారానే అన్ని వ్యవహారాలను చక్క పెడుతున్నారు.అప్పుడప్పుడు రెండు రోజుల పాటు మకాం వేసి హడావుడి చేయడం తప్పించి ప్రధానమైన సమస్యల పైనా సైలెంట్ గా ఉంటున్నారు.

టిడిపి,  చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా,  బాలయ్య మౌనంగానే ఉంటున్నారు.

  """/"/ ఎక్కువగా సినిమా లపైనే ఫోకస్ పెట్టారు.షూటింగుల్లో బిజీగా గడుపుతున్నారు తప్పించి, టిడిపిలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.

దీంతో సహజంగానే బాలయ్య పై విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి .అయితే ఇప్పుడు బాలయ్య తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు.

జిల్లాల అంశంతో మొదలుపెట్టి ఎన్నికల వరకు ఇదే స్పీడ్ కొనసాగించి టిడిపిలో కీలకం కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు గా బాలయ్య సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం హిందూపురం జిల్లా కేంద్రం చేయాలనే విషయంలో బాలయ్య ఎంత వరకు పైచేయి సాధిస్తారో చూడాలి.

పుష్ప సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!