బాలయ్య రేంజ్ ఇంతలా పెరిగిందా.. అన్ని వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ లో ఉండటంతో పాటు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడం బాలయ్యకు ప్లస్ అవుతోంది.

అయితే ఈ మధ్య కాలంలో బాలయ్య( Balakrishna ) సినిమాల బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అని సమాచారం.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు బాలయ్య మార్కెట్ ఈ రేంజ్ లో పెరిగిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.100 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ తో సినిమా తీయలేనని బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గతంలో వెల్లడించారు.

"""/" / మరోవైపు అఖండ కాంబినేషన్ సినిమా కావడంతో భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతోంది.

అఖండ కరోనా సమయంలో విడుదలైనా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించిన సంగతి తెలిసిందే.

అఖండ సీక్వెల్ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది.బాలయ్య సైతం అఖండ సీక్వెల్ ( Akhanda 2 )షూట్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

బోయపాటి శ్రీను ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.

అటు బాలయ్య, ఇటు బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ల కోసమే 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుఒతోంది.

అఖండ సీక్వెల్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందని భోగట్టా.

డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఇలాగే కాబోలు.. వైరల్ వీడియో