మోక్షజ్ఞ దిగనంత వరకే.. మోక్షజ్ఞ ఇప్పటికే స్టార్ హీరో.. బాలయ్య కామెంట్స్ వైరల్!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇవ్వగా మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ ఇచ్చి రాణిస్తున్నారు.

అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కూడా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే హీరోగా రాణించవచ్చు అనే చాలా మంది హీరోలు ఇప్పటికే ప్రూవ్ చేసిన విషయం తెలిసిందే.

కానీ తన తనయుడు మోక్షజ్ఞ ( Mokshagna )మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ అయ్యాడు అంటూ నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )అంటున్నారు.

కాగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

"""/" / ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కొన్ని వందల కథనాలు కూడా వినిపించాయి.

కానీ త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుంది అని ఇప్పటికి కన్ఫామ్ అయిపోయింది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఒక మోక్షజ్ఞ నటించనున్నారు.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ డెబ్యూ గురించి తాజాగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ డెబ్యూ గురించి స్పందించారు.మోక్షజ్ఞ లాంచ్ పై ఆడియన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఎందుకంటే, ఆల్రెడీ అతను స్టార్.మేము ఎంతో కష్టపడితే స్టార్స్ అయ్యాము.

కానీ మోక్షజ్ఞ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే స్టార్ అయిపోయి కూర్చున్నాడు.

"""/" / మోక్షజ్ఞ లాంచ్ గురించి, సినీ కెరీర్ గురించి నాకు ఎటువంటి టెన్షన్ లేదు అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

అయితే బాలయ్య మాటలను బట్టి చూస్తుంటే.మోక్షజ్ఞ డెబ్యూపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతోంది.

అదే సమయంలో ఇప్పటికే స్టార్ అయిపోయి కూర్చున్నాడని, నందమూరి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడం బట్టి చూస్తుంటే.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్లాన్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

మొత్తానికైతే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.కాగా తాజాగా బాలయ్య బాబు తన స్వర్ణోత్సవ వేడుకలలో ఈ వ్యాఖ్యలు చేశారు.

చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించే గ్రీన్ టీ.. ఎలా వాడాలంటే?