అమ్మ బీడీ కార్మికురాలు.. కొడుకు కలెక్టర్.. ఇతని సక్సెస్ స్టోరీ వింటే గ్రేట్ అనాల్సిందే!

సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్, ఐపీఎస్( IAS, IPS ) కు ఎంపిక కావడం కష్టమే అయినా కొంతమంది సులువుగానే ఆ కలను నెరవేర్చుకుంటున్నారు.

సివిల్స్ సాధించిన నందాల సాయికిరణ్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

బాల్యం నుంచి తల్లీదండ్రులు పని చేస్తే మాత్రమే పూట గడిచే పరిస్థితి ఉండేదని ఏడు సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యల వల్ల నాన్న మృతి చెందడం మరింత బాధ పెట్టిందని ఆయన తెలిపారు.

నాన్న లేడనే లోటు ఎంతో వేధించేదని సాయికిరణ్ ( Saikiran ) పేర్కొన్నారు.

అమ్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తూ అక్క, నేను కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటామని నమ్మేదని సాయికిరణ్ వెల్లడించారు.

నాన్న బ్రతికున్న సమయంలో మీ చదువుతో మాత్రమే మన బ్రతుకు మారుతుందని ఎంత పెద్ద స్థాయికైనా చేరవచ్చని ఎదిగిన తర్వాత మనలాంటి వాళ్లకు సాయం చేయడం మాత్రం మరవొద్దని చెప్పేవారని సాయికిరణ్ అన్నారు.

"""/" / మనసు పెట్టి చదివి పదో తరగతిలో మంచి మార్కులు సాధించానని ఆయన తెలిపారు.

ఇంటర్ లో 98 శాతం మార్కులు సాధించానని స్కాలర్ షిప్ తో వరంగల్ లోని ఎన్.

ఐ.టీలో సీటు సాధించానని సాయికిరణ్ వెల్లడించారు.

ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని నేను చదువుకున్నానని ఆయన అన్నారు.అక్క స్రవంతి ఏఈగా జాబ్ సాధించారని సాయికిరణ్ వెల్లడించడం గమనార్హం.

"""/" / బీటెక్ లాస్ట్ ఇయర్ చదివే సమయంలో నాకు జాబ్ వచ్చిందని ఆయన అన్నారు.

ఉద్యోగంలో చేరే సమయానికి నా వయస్సు 21 సంవత్సరాలు అని సాయికిరణ్ తెలిపారు.

ఆ తర్వాత ఐఏఎస్ లక్ష్యాన్ని ఎంచుకుని సాధించానని ఆయన చెప్పుకొచ్చారు.రెండో ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

సివిల్స్ కోసం సొంతంగా ప్రిపేరై 27వ ర్యాంక్ సాధించానని సాయికిరణ్ వెల్లడించారు.

ఓ మంచి ఘోస్ట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్?