ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ పేరు గొప్పగా వినిపిస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాలలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు.
అయితే నరేంద్ర మోడీ మీద ఒక ఆరోపణ ఉంది.అయన హిందుత్వ వాది.
ఇండియాని హిందుత్వ దేశంగా మార్చే క్రమంలో ఇతర మతాల వారికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారని.
అయితే ఈ హిందుత్వ వాదన బీజేపీ పార్టీకి, ప్రధాని మోడీకి పెద్ద బలంగా ఉందని చెప్పాలి.
ఇదిలాంటే 2002లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోద్రాలో అల్లర్లు చెలరేగాయి.
అందులో సబర్మతి ఎక్స్ ప్రెస్ కి నిప్పు పెట్టడం వలన ముస్లిం వర్గానికి చెందిన చాలా మంది చనిపోయారు.
అందులో నరేంద్ర మోడీని ముద్దాయిగా చేర్చారు.అతని ప్రోద్బలంతోనే ఈ అల్లర్లు జరిగాయని బీజేపీయేతర పార్టీలు ఇప్పటికి ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రధాని మోడీకి నానావతి కమిషన్ ఈ గోద్రా అల్లర్లలో క్లీన్ చిట్ ఇచ్చింది.
జరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ ఈ అల్లర్లపై విచారణకు 2002లో నానావతి కమిషన్‌ను వేశారు.
మూడు రోజులపాటు సాగిన హింసను పోలీసులు ఏ మాత్రం అరికట్టలేక పోయారని కమిషన్ తెలిపింది.
ఆ పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది.దీంతో పాటు ఈ ఘటనతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
నానావతి కమిషన్ రిపోర్టును ఇవాళ గుజరాత్ అసెంబ్లీ టేబుల్‌పై ఉంచారు.ఐదేళ్ల క్రితం కూడా రిటైర్డ్ జస్టిస్‌లు నానావతి, అక్షయ్ మోహతాలు ఈ ఘటనకు సంబంధించిన తుది నివేదికను అప్పటి ఆనందిబెన్ ప్రభుత్వానికి సమర్పించింది.
తాజా నివేదిక ప్రకారం ప్రధాని మోడీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం నానావతి కమిషన్ స్పష్టం చేసింది.