Namrata Shirodkar : సితార విషయంలో నమ్రత ఫుల్ ప్లానింగ్..అన్ని బాంబే తెలివి తేటలు మరి !
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తక్కువ కాలంలోనే తన కంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఎంత వయసొచ్చిన ఇప్పటికి ఒక కుర్రాడిలానే కనిపిస్తాడు.మహేష్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.
గుంటూరు కారం తరువాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు.మహేష్ నమ్రతని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
వీరి పెళ్ళికి ముందు కృష్ణ ఒప్పుకోకపోయినా ఆ తరువాత మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు.
కృష్ణ తన కూతురిని సినిమాల్లోకి రానివ్వలేదు.దీంతో మహేష్ బాబు కూతురు కూడా సినిమాల్లోకి రాదేమో అనుకున్నారు.
కానీ మహేష్ భార్య నమ్రత( Namrata Shirodkar ) మాత్రం ఇప్పటి నుంచే సితారను భావి హీరోయిన్ గా తీర్చిదిద్దుతోంది.
"""/" /
సితార తాజాగా ఒక నగల యాడ్ లో కనిపించి సందడి చేసింది.
అంతేకాదు ఈ యాడ్ కోసం భారీగా రెమ్యునరేషన్( Remuneration ) కూడా తీసుకుందనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోల్లో సితార అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అంతేకాదు ఈ యాడ్ కి వచ్చిన డబ్బులని డొనేషన్ ఇ 0చ్చేసా అని ముసిముసిగా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
నాన్నకి తగ్గ కూతురు అని కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.దీంతో సితార సినిమాల్లో కూడా వచ్చే అవకాశం ఉందని, అయితే ఇంకా టైం ఉందని, కానీ నమ్రత ఇప్పటి నుంచే సితారను ప్రిపేర్ చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
నమ్రత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అన్ని విషయాల్లో యాక్టీవ్ గా ఉంటుంది.
"""/" /
కానీ సితార ( Sitara ) ఇప్పుడే ఇవన్నీ చేస్తూ పోతే ఇక బాల్యాన్ని ఏం చేస్తుంది అని కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఒక్కసారి వెళ్ళిపోతే బాల్యం తిరిగి రాదు కదా.బాల్యాన్ని పిల్లలు ఎంజాయ్ చేయాలి, స్నేహితులతో కలిసి తిరగలి, స్కూల్ కి వెళ్ళాలి, రోడ్డు మీద తిరగడం, స్పోర్ట్ డేలో పాల్గొనడం ఇలా ఎన్నో ఉన్నాయి.
మరి ఇప్పటి నుంచే సితార యాడ్స్ లో, షార్ట్ వీడియోస్ చేస్తుంటే సితార బాల్యం మిస్ అవుతుంది కదా అని మాట్లాడుకుంటున్నారు.
అర్ధం కాని వయసులో ఉండగానే మార్కెటింగ్ అనే సంపాదనలోకి పంపిస్తే తరువాత ఆ డబ్బు చదువుకి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు.
ఈ వయసులోనే బ్రాండ్ అని అలవాటు చేసి పిల్లలను పక్కదారి పట్టిస్తున్నారని నెటిజెలు అంటున్నారు.
కానీ నమ్రత పిల్లల విషయంలో ఫుల్ ప్లానింగ్ లో ఉంది అనే చెప్పాలి.
సితారకి ఇప్పటి నుంచే మిస్వరల్డ్, మిసిండియా కంపిటీషన్లకు తయారు చేస్తుంది.అంతేకాదు నమ్రత ఇంటి విషయాలపై పూర్తి ప్లానింగ్ తో ఉంటారు.
అందుకే సితార విషయంలో నమ్రత అడుగులు అటువైపే వేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.
సగం హైదరాబాద్ కొనేయాలనుకున్న హీరో నాని..??