జర్మనీలో మహేష్ బాబు… భర్తను ఎంతో మిస్ అవుతున్న నమ్రత?
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనకు షూటింగ్ పనులలో ఏ మాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా వెకేషన్ కి వెళ్తూ ఉండే ఈయన ఈసారి మాత్రం తన ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా జర్మనీ వెళ్లారు.
మహేష్ బాబు ఇలా ఒంటరిగా వెళ్ళేది చాలా అరుదుగా ఉంటుంది షూటింగ్ అయినా షూటింగ్ లేకపోయిన ఫ్యామిలీతో కలిసి ఈయన వెకేషన్ వెళ్తూ ఉంటారు.
ఈ విధంగా మహేష్ బాబు ఒంటరిగా జర్మనీ (Germany) వెళ్లడంతో ఈయన వెకేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
"""/" /
మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమా కోసమే వెకేషన్ వెళ్లారని పలువురు భావించగా మరికొందరు మాత్రం ఈయన ఫిట్నెస్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్లారని భావిస్తున్నారు.
మహేష్ బాబు జర్మనీ వెళ్లి దాదాపు పది రోజులు అవుతుంది.ఇలా జర్మనీలో గడ్డకట్టే చలిలో డాక్టర్ తో కలిసి ఈయన బ్లాక్ ఫారెస్ట్ లో ట్రేక్కింగ్(
Trekking ) వెళ్లినట్టు కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నమ్రత ఈ ఫోటోలపై రియాక్ట్ అయ్యారు.
"""/" /
ఇన్ని రోజులు మహేష్ బాబును వదిలి నమ్రత ఎప్పుడు ఉండలేదని తెలుస్తుంది.
ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీతో సహా వెళ్లే మహేష్ బాబు ఈసారి ఒంటరిగా ఉండడంతో మహేష్ బాబుని నమ్రత (Namrata) చాలా మిస్ అవుతున్నారని తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది.
మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలపై నమ్రత స్పందిస్తూ మిస్ యు అంటూ లవ్ సింబల్ తో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నమ్రత పుట్టినరోజుకి కూడా మహేష్ బాబు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
మరి ఈయన జర్మనీ వెళ్లడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.
నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?