శ్రీవారి ఆలయంలో పూజలు చేస్తున్న నమ్రత.. మహేష్ కోసమే ఈ పూజలా?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నమ్రత ఒకవైపు ఘట్టమనేని కోడలిగా బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు మహేష్ బాబు కి సంబంధించిన బిజినెస్ పనులను కూడా చూసుకుంటూ ఉంటుంది.
సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది.కాగా తాజాగా నమ్రత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది.
తాజాగా నమ్రత నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించింది.
"""/" /
ఈ సందర్భంగా ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నమ్రత అనంతరం స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
అలాగే అక్కడే ఉన్న గోశాలను సందర్శించి గోమాతకు పూజించి ప్రదక్షిణలు కూడా చేసింది.
తెలంగాణ చిన్న తిరుపతిగా పేరు పొందిన ఈ వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నమ్రత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
"""/" /
ఈ ఆలయాన్ని చూస్తే తిరుపతి వెళ్లిన అనుభూతి కలుగుతుందని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
గుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారు కొలువు తీరారని అన్నారు.నమ్రతకు ఆలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు.
ఆలయ విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ మహేష్ కోసం పూజలు చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా సక్సెస్ కొట్టడానికి ట్రై చేస్తున్న స్టార్ డైరెక్టర్…