హృదయంతో డాన్స్ చెయ్యి.. నీ పాదం అనుసరిస్తుంది.. సితార డ్యాన్స్ పై నమ్రత పోస్ట్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రత గారాల పట్టి సితార( Sitara ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సితార ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇంత చిన్న వయసులోనే ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
సితార ఎంతో టాలెంట్ కలిగిన అమ్మాయనే విషయం మనకు తెలిసిందే.ఈమె తరచూ తన డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
"""/"/
ఇక గతంలో తాను భరతనాట్యం( Bharatanatyam ) నేర్చుకోబోతున్నాను అంటూ సితారా తెలియజేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఈమె భరతనాట్యం నేర్చుకున్నారని ఒక వీడియోని నమ్రత ( Namrata Shirodkar ) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
ఇలా సితార డాన్స్ పర్ఫామెన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ డాన్స్ వీడియో పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
గ్రేట్ పర్ఫామెన్స్ అంటూ కొందరు పోస్టులు చేయగా మరికొందరు సితార ఓ స్టార్ అంటూ పోస్టులు చేస్తున్నారు.
"""/"/
ఈ విధంగా సితార అద్భుతమైన పర్ఫామెన్స్ చేయడం తో ఒక అమ్మగా నమ్రత తన కూతురి పర్ఫామెన్స్ పై స్పందించకుండా ఉండలేకపోయారు.
ఈ క్రమంలోనే సితార డాన్స్ వీడియో పై నమ్రత స్పందిస్తూ.నీ హృదయంతో డాన్స్ చెయ్యి.
నీ పాదం అనుసరిస్తుంది అంటూ సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ పై నమ్రత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన వారందరూ సితార ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..