పనిమనిషి పుట్టినరోజు… ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతల సంపాదించుకున్నటువంటి నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన నటి నమ్రతను ( Namrata ) వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తన కుటుంబ బాధ్యతలను అలాగే పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.
ఇలా మహేష్ బాబు భార్యగా నటిగా ఒక బిజినెస్మెన్ గా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె మహేష్ బాబు ఫౌండేషన్ వ్యవహారాలన్నింటిని కూడా చూసుకుంటారు అనే సంగతి తెలిసిందే.
ఇలా ఫౌండేషన్ ద్వారా ఈమె ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ( Social Media )ఎంతో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన అన్ని విషయాలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తన పనిమనిషితో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇందులో భాగంగా నమ్రతతో పాటు తన పిల్లలు కూడా ఉన్నారు.ఇలా పని మనిషితో కలిసి దిగినటువంటి ఫోటోలు నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆమె గురించి ఎంతో గొప్పగా తెలియజేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
"""/" /
తన ఇంట్లో గత కొన్ని తరాలుగా ఈమె పని చేస్తూ ఉన్నారని తెలిపారు.
తన పేరు శాలిని కొండ్ర తన పుట్టినరోజు కావడంతో నమ్రత తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు.
అనంతరం ఈమె తన ఇంట్లో కొన్ని జనరేషన్స్ నుంచి పనిమనిషి గానే పనిచేస్తున్నారని తెలిపారు.
ఈమె తన గ్రాండ్ పేరెంట్స్ ని పేరెంట్స్ ని ఇప్పుడు తన పిల్లల్ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని నమ్రత తెలిపారు.
అంతేకాకుండా ఈమె తన కుటుంబంలో ఎన్నో పాత్రలను పోషించారని తెలిపారు.ఒక తల్లిగా గార్డియన్ గా, హౌస్ కీపింగ్ అలాగే నానీగా కూడా వివిధ రకాల పాత్రలను పోషించారని తెలియజేశారు.
"""/" /
నా తల్లిదండ్రుల తర్వాత ఈమెని నేను సొంత మనిషిగా భావిస్తానని ఈమె మాతో కలిసి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ తన పనిమనిషి గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ నమ్రత ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఈ పోస్ట్ చూసినటువంటి ఎంతోమంది మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నమ్రత ఒక పని మనిషిని పని మనిషిలా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటున్నారు అంటూ ఈమెపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నమ్రత ఇంట్లో పని చేసే వారిని కూడా సొంత వాళ్లగా భావించడం అంటే నిజంగా గ్రేట్ అని అలా ఫీల్ అవ్వాలి అంటే ఎంతో గొప్ప మనసు కూడా ఉండాలి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.