పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి:నాంపల్లి సింగిల్ విండో తీర్మానం

నల్లగొండ జిల్లా:పదెకరాల వరకు పంట భూమి ఉన్న రైతులకే ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా(బంధు) పథకం అమలు చేయాలని నాంపల్లి సింగల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి అన్నారు.

నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల రైతులు ఇచ్చిన అభిప్రాయం మేరకు పది ఎకరాల వరకు షరతులు లేకుండా రైతు బంధు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు.

గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా రైతులకు మేలు జరిగే విధంగా రైతుబంధు ఇవ్వవలసిందిగా వివిధ గ్రామాల రైతులు కోరారని, గుట్టలకు,రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు ఇవ్వద్దని,నిజమైన రైతులకే రైతుబంధు చెందాలన్నారని,ఈ తీర్మానాన్ని కమిటీ ఆమోదించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దండిగ సత్తయ్య,అగ్రికల్చర్ ఏడి ఎల్లయ్య, అగ్రికల్చర్ ఏవో,సహకార జాయింట్ రిజిస్టర్ రామనరసయ్య, సింగిల్ విండో డైరెక్టర్స్ వెంకటరెడ్డి,సతీష్,ఆదిరెడ్డి, వివిధ గ్రామాల రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

అమానుషం.. యువకుడిపై దాడి ఆపై నోట్లో మూత్రం పోసి చిత్రహింసలు..