నల్గొండ ముస్లిం మైనారిటీ అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా:నల్గొండ నియోజకవర్గం( Nalgonda Assembly Constituency ) నుండి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేనందున, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరఫున ఆ సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్(Mohammad Nazir ) నల్గొండ నుండి బరిలో నిల్వనున్నారని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు.

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా,తమ ఏజెండాలోని అంశాలతో ముస్లిం వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి పోటీకి సిద్దపడ్డామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా,జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావిద్ అలి( Javid Ali ) తదితరులు పాల్గొన్నారు.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?