నెగ్గిన హాలియా మున్సిపల్ అవిశ్వాసం…!

నెగ్గిన హాలియా మున్సిపల్ అవిశ్వాసం…!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కో మున్సిపాలిటీని అవిశ్వాసం ద్వారా దక్కించుకుంటున్న అధికార కాంగ్రెస్ ఖాతాలోకి నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని హాలియా మున్సిపాలిటీ కూడా చేరిపోయింది.

నెగ్గిన హాలియా మున్సిపల్ అవిశ్వాసం…!

గురువారం మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక మున్సిపాలిటీ సమావేశంలో ప్రస్తుత చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ,వైస్ చైర్మన్‌ నల్గొండ సుధాకర్ పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.

నెగ్గిన హాలియా మున్సిపల్ అవిశ్వాసం…!

మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను చైర్‌ పర్సన్,వైస్ చైర్మన్ మినహా మిగతా 10 మంది కాంగ్రెస్‌,బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులు లేపడంతో దానిని రికార్డ్ చేసిన ఆర్డీవో అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు.

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డికి ఎక్స్ అఫీషియా ఓటు ఉన్నప్పటికీ పూర్తి కోరం ఉండడంతో ఎమ్మెల్యే తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే ఏకగ్రీవ తీర్మానంతో చైర్ పర్సన్,వైస్ చైర్మన్లు తమ పదవులు కోల్పోయారు.

చంపుతామని బెదిరిస్తున్నారు… సింగర్ సునీత వల్లే ఇదంతా: ప్రవస్తి 

చంపుతామని బెదిరిస్తున్నారు… సింగర్ సునీత వల్లే ఇదంతా: ప్రవస్తి