నల్గొండ జిల్లా.. జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి భేటి

నల్లగొండ జిల్లా:మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటి అయ్యారు.

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటి జరిగినట్లు సమాచారం.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని జానా భట్టికి సూచించినట్లు తెలుస్తోంది.

ఈ భేటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.