అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న నల్లగొండ కలెక్టర్…!

నల్లగొండ జిల్లా: జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల ప్రక్షాళన మొదలు పెట్టారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలపై విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సస్పెన్స్ ఆర్డర్స్ జారీ చేస్తూ జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ మూడు రోజుల నుండి విధులకు గైర్హాజరవుతున్న జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలనాధికారి అబ్దుల్ మన్నన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం,కనీసం సెలవు సైతం పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని వదిలి పెట్టేది లేదని, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని,సమయపాలన పాటించాలని,లేదంటే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు.

రైతు రుణమాఫీపై కార్యాలయానికి వచ్చే రైతులకు సహాయం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో తక్షణమే రెండు కంప్యూటర్లు,రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇద్దరు ఆపరేటర్లు,ఫోన్లు స్వీకరించేందుకు ఇద్దరు, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు ప్రత్యేకించి కాల్స్ నమోదు చేసేందుకు మరో ఇద్దరు మొత్తం ఎనిమిదిని తక్షణమే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు.

రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చిన రైతులను వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లాలని సాకులు చెప్పి పంపించవద్దని,వెంటనే కంప్యూటర్లో లాగినై రైతుకు డబ్బు ఎందుకు జమ కాలేదో చెప్పగలగాలని, రుణమాఫీపై జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు.

గ్రీవెన్స్ రిజిస్టర్ ను ప్రత్యేకంగా కలెక్టర్ పరిశీలించారు.రుణమాఫీ డబ్బులు జమకాలేదని కార్యాలయానికి వచ్చిన చింతమల్ల సందీప్ కుమార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకొన్న కలెక్టర్ వెంటనే రైతు సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ ఏడి హుస్సేన్ బాబును ఆదేశించారు.

కార్యాలయాలలో ఆకస్మిక తనిఖీలు జరుగుతూనే ఉంటాయని, తిరిగి వస్తానని, అధికారులు సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని,విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.

జిల్లాలో పరిపాలన గాడి తప్పకుండా ఉండాలంటే ఇలాంటి కలెక్టర్ కదా కావాల్సిందని జిల్లా ప్రజలు కలెక్టర్ నారాయణరెడ్డి తీరుపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ అలా చేయడంతో గూస్ బంప్స్ వచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్!