వర్మ మర్డర్ కోర్టులోనే ముగిసిపోయేలా ఉందిగా…?

తాజాగా తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే "మర్డర్" అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ చిత్రం తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.

దీంతో ఈ కథకి సంబంధం ఉన్నటువంటి అమృత ప్రణయ్ ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ ఇటీవలే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

దీంతో కోర్టు అధికారులు విచారణకు హాజరు కావాలని నిర్మాత రామ్ గోపాల్ వర్మ కి మరియు నూతన దర్శకుడు ఆనంద్ చంద్ర కి ఈ - మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేశారు.

అయినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు స్పందించక పోవడంతో ఇటీవలే నల్గొండ జిల్లా కోర్టు కౌంటర్ ని దాఖలు చేసింది.

ఇందులో భాగంగా కోర్టు నిర్ణయించిన గడువు లోపు కచ్చితంగా గా రీ కౌంటర్ వేయాలని లేకపోతే నియమ నిబంధనల ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కోర్టు అధికారులు తెలిపినట్లు సమాచారం.

దీంతో మర్డర్ చిత్రం విడుదల పై కొంతమేర సందిగ్దత నెలకొంది.అయితే ఈ విషయం పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఆన్ లైన్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరుతాడని, కాకపోతే కొంచెం ఆలస్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు ఈ చిత్ర విడుదలను నిలిపి వేయాలని కేవలం ప్రణయ్ అమృత కుటుంబ సభ్యులు మాత్రమే కోరుతున్నారు.

కానీ మారుతీరావు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.

చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించే గ్రీన్ టీ.. ఎలా వాడాలంటే?