నల్గొండ బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్ కూల్చండి:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ ను తక్షణమే కూల్చేయాలంటూ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడుగుతున్న అధికారులు,100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో అగ్రికల్చర్ సొసైటీకి సంబంధించి దాదాపుగా 4 ఎకరాల స్థలం ఉందని, అందులో రెండు ఎకరాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.

150 కోట్ల విలువైన భూమిని బీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ స్థలాన్ని అన్యాయంగా తీసుకున్నారని ఎంపీగా ఉన్నప్పుడే ఆరోపించడం జరిగిందని,ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి తాను ప్రపోజల్ పెట్టానని గుర్తు చేశారు.

అయినప్పటికీ గతంలో ఏకపక్షంగా భూములు తీసుకున్నారని ఆరోపించారు.ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామని కమిషనర్ తెలుపగా,పేదవాళ్ళు 100,200 గజాలలో ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్ లేకుంటే ఎలా కూల్చివేశారో,అలానే బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారాన్ని మోనిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కూడా సూచించారు.కామన్ మ్యాన్ కి ఏ విధంగా రూల్స్ ఉన్నాయో అందరికీ అవే రూల్స్ ఉండాలన్నారు.

యూకే సార్వత్రిక ఎన్నికలు : చరిత్ర సృష్టించిన కేరళ సంతతి వ్యక్తి.. నర్స్ నుంచి ఎంపీగా..!!