రామలక్ష్మణ, భరత శతృఘ్నుల దర్శనం నాలాంబళ యాత్ర

శ్రీరాముడు అంటే హిందువులకు అత్యంత ప్రీతి పాత్రమైన దేవుడు.ఆయన నడయాడిన ప్రాంతాలను, నేలను చూసేందుకు భక్తులు ఎప్పటికీ ఉవ్విళ్లూరుతుంటారు.

గుడిలో ఆయన దర్శనానికి బారులు తీరుతారు.శ్రీరామ నామం దివ్యమైనది.

పితృ వ్యాఖ్య పాలకుడిగా ఆయన పేరుగాంచారు.అలాగే ఆయన మాట జవదాటకుండా భరతుడు.

వారి కనిష్ఠ సోదరుడు శత్రఘ్నుడు రాజ్యాన్ని పాలించారు.అన్న శ్రీరామ చంద్రుని పాదుకలను సింహాసనం పై ఉంచి పాలన సాగించారు.

అయితే ఏ గుడికి వెళ్లినా, ఏ ఫోటో చూసినా లక్ష్మణ సమేత సీతారామచంద్రులు, హనుమంతుడు మాత్రమే కనిపిస్తారు.

కానీ అన్న మాట జవదాటకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పాలించి భరతుడు, శత్రఘ్నుల దేవాలయాలు కానీ, ఫోటోలు కానీ కనిపించవు.

కానీ కేరళలో వీరికి కూడా ఆలయాలు ఉన్నాయి.అక్కడికి వెళ్తే నలుగురు అన్నదమ్ముల గుళ్లు చూసి దర్శించుకోవచ్చు.

కేరళలోని త్రిస్సూరు, ఎర్నాకుళం జిల్లాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి.ఈ నాలుగు టెంపుల్స్ ను చుట్టి రావడాన్ని నాలాంబళ యాత్రగా పేర్కొంటారు.

"""/" / ఈ యాత్ర మొదట త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ ఆలయంలోని శ్రీరాముని దర్శనంతో ప్రారంభం అవుతుంది.

తర్వాత ఇరింజల్ కుడలోని కూడల్ మాణఇక్యం ఆలయంలో భరతుడిని దర్శించుకోవాలి.అక్కడి నుండి ఎర్నాకుళం జిల్లా అంగమాలి ప్రాంతంలోని మూళికులంలో లక్ష్మణ పెరుమాళ్ ఆలయం ఉంటుంది.

తర్వాత త్రిస్సూర్ జిల్లాలోని శత్రఘ్న స్వామి వారిని దర్శించుకోవాలి.తర్వాత అక్కడికి దగ్గర్లోని హనుమంతుని దర్శించుకుంటే నాలాంబళ యాత్ర పూర్తి అవుతుంది.

టీపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ?