పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే...? రేవంత్ కు ఆయన వార్నింగ్
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రేవంత్ నీతి నిజాయితీ లేని కుక్క అంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు టిఆర్ఎస్ఎల్పి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరుమర్తి లింగయ్య సంచలన విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి కి డబ్బులు, పదవే ముఖ్యమని, ఆయనకు ప్రమాణాలు , ప్రజా సేవ అవసరం లేదని లింగయ్య ధ్వజమెత్తారు.
కెసిఆర్ చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి రేవంత్ కు నిద్రపట్టడం లేదని, అందుకే బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావు అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన గౌరవం ఎంతో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.రేవంత్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని , తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారు అంటూ లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే , కాంగ్రెస్ కు కడుపు మంట ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ఇష్టమొచ్చినట్లు కెసిఆర్ పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది.
"""/"/
కెసిఆర్ పై అదే పనిగా రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తుండడంతో, మొన్నటి వరకు మంత్రి గంగుల కమలాకర్, హరీష్ రావు వంటి వారే స్పందిస్తూ వచ్చేవారు.
అయితే ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రేవంత్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
ఇక పూర్తిస్థాయిలో రేవంత్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాల్సిందిగా టిఆర్ఎస్ అధిష్టానం నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో నే ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగి తమ నోటికి పని చెప్పినట్టు గా కనిపిస్తున్నారు.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?