నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇల్లు ముట్టడి

నల్లగొండ జిల్లా:బీజేపీ నాయకుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటిని గురువారం బీజేపీ శ్రేణులు ముట్టడించారు.

గత కొద్ది రోజుల క్రితం బండి సంజయ్ కవితపై మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా నకేరేకల్ లో ధర్నా చేసిన సందర్భంగా నకేరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీజేపీ నాయకుల భార్యలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్దు పెట్టుకుంటే మీరు ఊరుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నార్కట్ పల్లిలోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించి, ఎమ్మెల్యే బయటికి రావాలి,బీజేపీ మహిళలకుముద్దులు పెట్టాలని నినదించారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.

ఎట్టకేలకు బీజేపీ ఆందోళన కారులనుపోలీసులు అరెస్టు చేసి,పోలీస్ స్టేషన్ కి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ సంవత్సరం స్టార్ హీరోలకు బాగా కలిసివచ్చిందా..?