విదేశానికి ప్రయాణం.. డబ్బులు కట్టలేదని కళ్లెదుటే తోటి వలసదారుడిని చంపేసిన మాఫియా.. చివరికి?

నాగ్‌పూర్‌కు( Nagpur ) చెందిన 33 ఏళ్ల హర్‌ప్రీత్ లాలియా( Harpreet Laliya ) అలియాస్ రోషన్( Roshan ) కెనడాలో( Canada ) టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ.

4 లక్షలు సంపాదించాలని కలలు కన్నాడు.ఈ కలను నిజం చేసుకోవడానికి తన కుటుంబం బంగారం, రెండు ట్రక్కులు అమ్మేశాడు.

అప్పులన్నీ తీర్చేసి మెరుగైన భవిష్యత్తు కోసం ఏకంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి అమెరికా-మెక్సికో సరిహద్దుకు( US-Mexico Border ) చేరుకున్నాడు.

కానీ, అతడి ఆశలు అడియాసలయ్యాయి, ఆ కల కాస్తా పీడకలగా మారింది.రోషన్ మొత్తం 62 రోజులు ప్రయాణించాడు.

తిండిలేకుండా గంటల తరబడి అడవులు, కొండల్లో నడిచాడు.ఆ నరకం లాంటి జర్నీలో కొన్ని దారుణాలు కూడా చూశాడు.

ముఖ్యంగా డబ్బులు కట్టలేదని మనుషుల్ని అమ్మేసే ముఠా ఒక వలసదారుడిని( Migrant ) కాల్చి చంపడం కళ్లారా చూసి షాక్ తిన్నాడు.

ప్రాణాల్ని అర చేతిలో పెట్టుకుని చివరకు ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటాడు.దురదృష్టవశాత్తు, అప్పుడే రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

చేతులకు సంకెళ్లు వేసి అమెరికా మిలిటరీ విమానంలో దేశానికి తిప్పి పంపించడంతో అతడి బాధకు అవధులు లేకుండా పోయాయి.

"""/" / అసలు కథ గురుదాస్‌పూర్‌లోని ఓ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్‌తో మొదలైంది.కెనడా టూరిస్ట్ వీసా ఇస్తానని, దాన్ని వర్క్ పర్మిట్‌గా మారుస్తానని నమ్మబలికి ఏకంగా రూ.

18 లక్షలు గుంజేశాడు.రోషన్ డిసెంబర్ 5న మాంట్రియల్‌కు వెళ్లాలని అబుదాబికి ఫ్లైట్ ఎక్కాడు.

కానీ, ఎయిర్‌పోర్టులో ఎతిహాద్ ఎయిర్‌వేస్ అధికారులు ఇండియన్ ఎంబసీ ఆదేశాలంటూ అతడిని లోపలికి అనుమతించలేదు.

ఏజెంట్ చెప్పిన మాయమాటలు నమ్మి ఎంబసీకి ఫోన్ చేస్తే డబ్బులు పోతాయని సైలెంట్ అయిపోయాడు.

"""/" / ఆ తర్వాత రోజుల్లో రోషన్ చాలా దేశాలు తిరిగాడు.ఈజిప్ట్, స్పెయిన్, గ్వాటెమాల, నికరాగువా, మెక్సికో.

ఇలా ప్రతి చోటా లంచాలు ఇస్తూనే ఉన్నాడు.హోండురాస్‌లో నకిలీ పత్రాల కోసం ట్రాఫికర్లకు రూ.

1.2 లక్షలు సమర్పించుకున్నాడు.

మెక్సికోలో అయితే, పోలీసులతో చేతులు కలిపి లోకల్ మాఫియా మొత్తం అక్రమ వలసలను శాసించింది.

అమెరికా సరిహద్దు దాటిన తర్వాత, రోషన్ 16 గంటలు నడిచి అలిసిపోయి కూలబడ్డాడు.

అంతే, పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.నేరస్తుడిలా చేతులకు సంకెళ్లు వేశారు.

12 రోజుల పాటు చిప్స్, యాపిల్, జ్యూస్ తప్ప ఇంకేమీ పెట్టలేదు.జనవరి 22న 103 మంది భారతీయులతో కలిసి రోషన్‌ను ఇండియాకు పంపించేశారు.

వాళ్లలో చాలామంది అక్రమ మార్గాల కోసం రూ.30-రూ.

50 లక్షల వరకు ఖర్చుపెట్టారు.విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగే వరకు వాళ్ల కాళ్లు, చేతులకు సంకెళ్లేసి ఉంచారు.

రోషన్ కథ అక్రమ వలసల వెనుక ఉన్న చీకటి నిజాలను కళ్లకు కడుతుంది.

EU Online Gambling Laws — Practical Strategy For High Rollers With Montreal Casino Online Interests