గుంటూరు కారం విషయంలో మేము చేసిన తప్పు ఇదే.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాకు ఆశించిన టాక్ రాకపోయినా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ( Naga Vamsi )మాట్లాడుతూ గుంటూరు కారం సినిమాకు బెనిఫిట్ షోస్ వేసి తప్పు చేశామని పేర్కొన్నారు.

ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు.కలెక్షన్లు ఫేక్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎవరైనా అలా ఆరోపణలు చేస్తే ప్రూవ్ చేయాలని నాగవంశీ చెప్పుకొచ్చారు.

"""/" / మహేష్ త్రివిక్రమ్ కాంబో అనేసరికి ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ అని ఫ్యాన్స్ భావించారని ఆయన అన్నారు.

అందువల్ల ప్రీమియర్ షో ఆడియన్స్ నిరాశకు గురయ్యారని నాగవంశీ కామెంట్లు చేశారు.దానివల్లే సినిమాపై నెగిటివిటీ వచ్చిందని ఫీలవుతున్నానని నాగవంశీ పేర్కొన్నారు.

గుంటూరు కారం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని ముందుగా ప్రచారం చేయలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రచారం చేయడానికి తగినంత సమయం మాకు కూడా లేకుండా పోయిందని నాగవంశీ పేర్కొన్నారు.

అలా చెప్పి ఉంటే బాగుండేదని అనిపించిందని ఆయన అన్నారు.జనవరి 5వ తేదీ వరకు గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయని హైదరాబాద్ లో గుంటూరు కారం ఈవెంట్ ప్లాన్ చేశామని నాగవంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

"""/" / ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అర్ధరాత్రి షో వేసి తప్పు చేశానని ఆయన అన్నారు.

ప్రీమియర్స్ తర్వాత వచ్చిన రివ్యూలు చూసి షాకయ్యానని నాగవంశీ చెప్పుకొచ్చారు.మహేష్ బాబు మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారని రెండో రోజు నుంచి రివ్యూలు మారతాయని నమ్మారని ఆయన చెప్పినట్టే జరిగిందని నాగవంశీ చెప్పుకొచ్చారు.

నాగవంశీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.గుంటూరు కారం ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

డీప్ సీక్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పేసుకున్న చైనా!