వామ్మో.. నాగశౌర్య భార్య పేరిట అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నాగశౌర్య భార్య అనూష పేరు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే.
అనూష శెట్టి నాగశౌర్య జోడీకి చాలామంది అభిమానులు అయ్యారు.అయితే అనూష శెట్టి ఆస్తుల విలువ ఏకంగా 80 కోట్ల రూపాయలు అని సమాచారం.
అనూష శెట్టికి సొంతంగా ఖరీదైన భవంతులు, కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.అనూష శెట్టి వర్కహాలిక్ అని సమాచారం.
ఖాళీగా ఉండటానికి ఆమె అస్సలు ఇష్టపడరని తెలుస్తోంది.వ్యాపారంలో తన ప్రతిభతో ఎంతో ఎదిగిన అనూష రాబోయే రోజుల్లో మరింత ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.
అనూష కెరీర్ లో సక్సెస్ కావడానికి నాగశౌర్య కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
నాగశౌర్య సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
కొన్ని సినిమాలు మరీ భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధించకపోయినా నాగశౌర్యతో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు నష్టాలు రాలేదు.
ఈ ఏడాది నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది.
నాగశౌర్య త్వరలో కొత్త సినిమాలను ప్రకటించనుండగా ఆ సినిమాలు నాగశౌర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
"""/"/
భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా నాగశౌర్య కెరీర్ లో స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
నాగశౌర్య పాన్ ఇండియా హీరో కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా శౌర్య ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.
సోషల్ మీడియాలో కూడా శౌర్యకు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నాగశౌర్య క్లాస్ సినిమాలతోనే ఎక్కువ సందర్భాల్లో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.భిన్నమైన కథలను ఎంచుకుంటూ నాగశౌర్య కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?