రంగబలి మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. ఆ వ్యక్తి లేకపోతే సినిమా డిజాస్టర్ అంటూ?
TeluguStop.com
నాగశౌర్య, యుక్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రంగబలి మూవీ( Rangabali Movie ) నేడు థియేటర్లలో విడుదలైంది.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగశౌర్య ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి 2 నుంచి 2.
5 రేటింగ్స్ వస్తున్నాయి.ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి.
"""/" /
అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీస్థాయిలో జరిగాయనే సంగతి తెలిసిందే.
సత్య కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.సత్య( Satya ) కామెడీ వల్ల ఈ సినిమా ఫస్టాఫ్ అయినా బాగుంది.
సత్య కామెడీ లేకపోతే మాత్రం ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకునేది.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూస్తే నాగశౌర్య నటించిన ఛలో మూవీ గుర్తుకొస్తుంది.
ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఎప్పుడో చూసిన సన్నివేశాలను గుర్తు చేస్తాయి.అయితే ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు తేలిపోయాయి.
హీరో చెప్పే మెసేజ్ లను వింటే ఈ జనరేషన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీశారా? అనే అనుమానం కలుగుతుంది.
మ్యూజిక్, బీజీఎం సైతం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో అయితే లేవనే సంగతి తెలిసిందే.
ఏ మాత్రం ఆసక్తి లేని కథ, కథనంను ఎంచుకోవడమే నాగశౌర్య మొదటి తప్పు అని చెప్పవచ్చు.
"""/" /
నాగశౌర్య ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.సిక్స్ ప్యాక్ లో ఈ సినిమాలో కనిపించడానికి శౌర్య( Nagashourya ) ఎంతో కష్టపడ్డారు.
శౌర్య ఇతర నటీనటులకు భిన్నంగా కెరీర్ విషయంలో అడుగులు వేస్తున్నారు.నాగశౌర్య తర్వాత సినిమాలు సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.
రంగబలి సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
హెల్మెట్ లేదు కానీ దౌర్జన్యం మాత్రం ఉంది.. కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు ఫైర్!