నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత‌

న‌ల్గొండ జిల్లా నాగార్జునసాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది.దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

ముందుగా 10 గేట్ల‌ను ఎత్తిన అధికారులు క్ర‌మంగా వ‌ర‌ద పెర‌గ‌డంతో 26 గేట్ల‌ను ఎత్తారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 588.00 అడుగులుగా ఉంది.

పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీల‌కు గాను ప్ర‌స్తుతం 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంద‌ని అధికారులు తెలిపారు.

అయితే 2009 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే 26 గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దిలిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

బత్తాయి తోటల్లో పురుగుల ఉధృతి నివారణకు సమగ్ర సస్యరక్షక చర్యలు..!