నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పొంచి ఉన్న ముప్పు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువకు మరోచోట ప్రమాదం పొంచి ఉంది.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హాలియా శివాలయం దగ్గర సైడ్ లైనింగ్ వాల్ కుంగింది.

ఇటీవలే ముప్పారం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడిన విషయం తెలిసిందే.

దీని కారణంగా సమీప ప్రాంత రైతులు వేల ఎకరాల్లో పంటలను నష్టపోయారు.ఆ నష్టాల నుంచి తేరుకోక ముందే మరో ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉండటంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కుంగిన వాల్ వద్ద గండి పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు సాగర్ ఎడమ కాలువకు నీటిని నిలిపివేశారు.