పట్టాలెక్కుతున్న బంగార్రాజు! త్వరలో సెట్స్ పైకి

నాగార్జున కెరియర్ లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ చేయగా అందులో ఒకటి బంగార్రాజు పాత్ర.

ఆ పాత్రలో నాగార్జున పండించిన రొమాంటిక్ కామెడీని తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు.

సింపిల్ కాన్సెప్ట్ అయిన ప్లెజెంట్ గా ఉండటంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది.ఇదిలా ఉంటే ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని బంగార్రాజు టైటిల్ తో వస్తుందని నాగార్జున గతంలో ప్రకటించాడు.

ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా చేసారు.

ఈ సినిమా కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.అయితే రవితేజతో నేల టికెట్ అనే సినిమా తీసిన్ డిజాస్టర్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ మీద నాగార్జున కొంత డౌట్ పడి బంగార్రాజు కథని పక్కన పెట్టాడు.

మరల దర్శకుడుని కొత్తగా మార్పులు చేర్పులు చేసి మరింత ఎంటర్టైనర్ గా ఈ సారి ఇందులో చనిపోయిన బంగార్రాజు మరల మనవడుగా తిరిగొస్తే అనే పాయింట్ తో కథని సిద్ధం చేసుకున్నాడు.

దీనిని నాగార్జునకి చెప్పి ఒప్పించాడు.ఇక బంగార్రాజు మనవడుగా ఇందులో నాగ చైతన్య నటించనున్నాడు.

ఇక ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ రెడీ కావడంతో త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక చైతూకి జోడీగా రష్మిక మందనని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.అయితే అధికారికంగా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడు కన్ఫర్మ్ చేయకున్న జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

అఖండ మూవీ సీక్వెల్ లో బాలయ్యతో పాటు పవన్.. వైరల్ వార్తలో నిజమెంత?