నాగ్‌ జోరు.. స్టార్‌ హీరోల్లో నాగార్జున మాత్రమే ఇలా చేశారు

నాగార్జున ఈ వారంలో వైల్డ్‌ డాగ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.

సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నాడు.స్టార్‌ హీరోల సినిమాలకు సాదారణంగా ఒక మోస్తరు వరకు పబ్లిసిటీ చేస్తారు.

చిన్న హీరోల సినిమాల కోసం మాత్రమే టీవీ షో లకు వెళ్లడం చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానెల్‌ తో ఇంటరాక్ట్‌ అవ్వడం చేస్తూ ఉంటారు.

కాని ఈ సినిమా కోసం మాత్రం చిన్న సినిమాల కోసం చేస్తున్న పబ్లిసిటీ పంథాను అనుసరిస్తున్నారు.

ఇప్పటికే నాగార్జున మై విలేజ్‌ షో గంగవ టీమ్ తో ఇంటరాక్ట్‌ అయ్యాడు.

ఇంకా పలువురు యూట్యూబర్స్ తో కూడా ఇంటరాక్ట్‌ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇక చివరగా నాగార్జున ప్రతి ఆదివారం స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న స్టార్ట్‌ మ్యూజిక్ లో కూడా వైల్డ్ డాగ్‌ యూనిట్‌ సభ్యులు సందడి చేసేందుకు సిద్దం అయ్యారు.

తాజాగా యూట్యూబ్‌ లో వచ్చిన ప్రోమో ఎంత మంది ప్రేక్షకులకు ఆశ్చర్యంను కలిగించింది.

నాగార్జున ఇలా ఒక టీవీ షో ప్రమోషన్‌ లో పాల్గొనడం ఏంటీ విడ్డూరం కాకుంటే అంటున్నారు.

మరి కొందరు మాత్రం నాగార్జున అంత పెద్ద స్టార్‌ అయినా కూడా ఇలా చేయడం చాలా గొప్ప విషయం అంటున్నారు.

మొత్తానికి సుమ స్టార్ట్‌ మ్యూజిక్ లో చేసిన సందడితో నాగార్జున సినిమాకు మంచి హైప్‌ రావడం ఖాయం అంటున్నారు.

సుమ స్టార్ట్‌ మ్యూజిక్ మంచి రేటింగ్ తో దూసుకు పోతుంది.ఇలాంటి సమయంలో నాగార్జున కూడా హాజరు అవ్వడం ఆ షో కు కూడా మంచి పేరును తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మొత్తానికి నాగార్జున బుల్లి తెరపై కనిపించడం వల్ల రెండు విధాలుగా ఇద్దరికి లాభం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఎన్నికలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరివాడు.. ఈ ప్రశ్నలకు జవాబు ఇదే!