యశోద ఆసుపత్రిలో కేసీఆర్ నీ పరామర్శించిన నాగార్జున..!!
TeluguStop.com
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది.
దీంతో వైద్యులు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ( Hip Replacement Surgery ) చేయడం జరిగింది.
తుంటి దగ్గర ఆపరేషన్ కావడంతో.దాదాపు 6 నుండి 8 వారాల వరకు విశ్రాంతి తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు.దీంతో ఆపరేషన్ అనంతరం చాలామంది ప్రముఖులు కేసీఆర్ ని కలుస్తున్నారు.
తాజాగా అక్కినేని నాగార్జున.( Akkineni Nagarjuna )ఆసుపత్రిలో కేసీఆర్ నీ పరామర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్( KTR ) తో ముచ్చటించి.కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సోదరుడు వెంకటేష్ తో కలిసి యశోద హాస్పిటల్ లో కేసీఆర్ ని పరామర్శించారు.
చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు కేసీఆర్ నీ పరామర్శిస్తున్నారు.అయితే ఆసుపత్రి వద్ద పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తాకిడి ఎక్కువ అవుతున్న క్రమంలో దయచేసి మిగతా రోగులకు అసౌకర్యం కలిగించకుండా.
ఆసుపత్రి వద్దకు రావద్దని కేసీఆర్ మొన్న వీడియో సందేశం ద్వారా తెలియజేయడం జరిగింది.
హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ కావడంతో మరో రెండు నెలలు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల( Telangana Election Results ) తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే.కేసీఆర్ పడిపోవడంతో ఎమ్మెల్యేగా కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు.
పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయడం రైటేనా.. వ్యతిరేకతకు అసలు కారణాలివే!