దసరా బరిలో నాగ్.. 'గోస్ట్' గ్లింప్స్ తోనే అదరగొట్టేసాడు!
TeluguStop.com
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
ప్రెసెంట్ నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ 'ది గోస్ట్' సినిమా ఒకటి.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నారు.మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇది ఒక్క ఎపిసోడ్ పూర్తి అయితే గోస్ట్ పూర్తి అయినట్టే.ఇక ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ద్వారా అత్యంత శిక్షణ పొందిన ప్రాణాంతకమైన ఏజెంట్ కు కోపం వచ్చినప్పుడు అన్స్టాపబుల్ కిల్లింగ్ మెషిన్ గా నాగ్ మారతాడని అర్ధం అవుతుంది.
గోస్ట్ తో ఎప్పుడు గొడవ పడకండి అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.ఇక ఈ గ్లింప్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనే చెప్పాలి.
అలాగే విజువల్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.అలాగే నాగ్ ఈ సినిమాలో చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు.
ఈ గ్లింప్స్ తో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇక ఈ గ్లింప్స్ ద్వారా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈసారి నాగ్ కూడా దసరా బరిలో ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
గోస్ట్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన శివ కూడా అక్టోబర్ 5నే రిలీజ్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ తో ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫుల్ ఖుషీ అవుతున్నారు.
"""/"/
ఇక ఈ సినిమాలో నాగ్ కు జోడీగా సోనాల్ చౌహన్ నటిస్తుండగా.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై శరత్ మరార్, పుష్కర్ రామ్మోహనరావు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers