బిగ్‌బాస్‌ 4 నుండి కీలక అప్‌డేట్‌, ఫ్యాన్స్‌ నిరుత్సాహం

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆగస్టు 30వ తారీకు నుండి ఈ షోను ప్రారంభించే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే బిగ్‌బాస్‌ నిర్వాహకులు మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటూ ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు జల్లారు.

ఏదో కారణం వల్ల షోను రెండు వారాల పాటు పోస్ట్‌ పోన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

నాగార్జునతో ప్రోమోలు షూట్‌ చేసిన యూనిట్‌ సభ్యులు వాటిని ఇంకా ప్రసారం చేయక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి.

ఆగస్టు 15వ తారీకున షో కు సంబంధించిన మొదటి ప్రోమోను విడుదల చేయబోతున్నారు.

అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి.ఇదే సమయంలో సెప్టెంబర్‌ రెండవ వారంలో షోను పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని స్టార్‌ మా వర్గాల వారు కూడా నిర్ధారిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ కష్టం అనుకుంటూ ఉండగా అనూహ్యంగా తెలుగు బిగ్‌బాస్‌ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఇప్పుడు వాయిదా వేయడంతో ఫ్యాన్స్‌ ఉసూరుమంటున్నారు.ఖచ్చితంగా ఈసారి తెలుగు బిగ్‌బాస్‌ మొదటి మూడు సీజన్స్‌తో పోల్చితే డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుందనే నమ్మకంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుండి ఈ ప్రకటనలు చేస్తున్న కారణంగా ఫ్యాన్స్‌ కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక కంటెస్టెంట్స్‌కు పరీక్షలు చేయించి రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి ఆ తర్వాత హౌస్‌కు పంపించే యోచనలో మేకర్స్‌ ఉన్న విషయం తెల్సిందే.

ఆ పక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది.త్వరలోనే మరో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వీడియో వైరల్: మండే ఎండల నుంచి రిలాక్స్ కావాలంటే ఇంటిని ఇలా చేసుకుంటేపోలే..