నాగచైతన్య శోభిత వివాహం… ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగార్జున!
TeluguStop.com
అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) శోభిత( Sobhita ) వివాహం ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.
ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాగచైతన్య సరిగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8:13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మాంగళ్యధారణ సమయంలో నాగార్జున అమల దంపతులతో పాటు వెంకటేష్ సురేష్ బాబు వెంకటేష్ కుటుంబ సభ్యులకు కూడా అక్కడే ఉన్నారు.
"""/" /
ఇలా నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేస్తున్న సమయంలో అఖిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ విజిల్స్ వేస్తూ సందడి చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరి వివాహం జరిగిన వెంటనే నాగార్జున( Nagarjuna ) సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నాగచైతన్య శోభిత కొత్త జీవితం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. """/" /
నాకెంతో ప్రియమైన చైతన్యకు శుభాకాంక్షలు ఇక మా ఇంట్లోకి అడుగుపెడుతున్న శోభితకు వెల్కమ్ అంటూ రాసుకోవచ్చారు.
వీరిద్దరూ సంతోషంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే శోభిత మా జీవితాలలోకి ఆనందాన్ని తీసుకువచ్చింది.
ఇక ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమైన తన తండ్రి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహం ముందే వీరిద్దరి వివాహం జరగడం మాకు ఎంతో ప్రత్యేకం అంటూ ఈ సందర్భంగా నాగార్జున తన కొడుకు పెళ్లి గురించి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇక శోభిత మాత్రం పెళ్లి వేడుకలలో సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబయ్యారనే చెప్పాలి.
ఈ దర్శకులు రాజమౌళి దారిలోనే నడుస్తున్నారా..?