నల్లగొండ జిల్లా: తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా భావించే నాగార్జున సాగర్ జలాశయం నీటి నిల్వలు లేక కుడి,ఎడమ కాలువల ఆయకట్టులో ఖరీఫ్ పంట సాగు ప్రశ్నార్ధకంగా మారింది.
సాధారణంగా ఆగస్టు నెలలోనే సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుని,ఉప్పొంగి ఉరకలు వేస్తూ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు సాగు,తాగు నీటి విడుదల జరిగేది.
కానీ,ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా వర్షాలు లేక ఎండలు మండుతుంటే వేసిన పంటలు ఎండుతున్నాయి.
ఎగువ నుండి వరద జాడ లేక కృష్ణమ్మ వెలవెల బోతుంటే సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయి కళ తప్పింది.
నైరుతి రుతుపవనాలు సకాలంలో అందక అడపా దడపా వర్షాలు పడుతున్నా ఎగువన కురిసే వానలతో వచ్చే వరద నీరు ద్వారా సాగర్ నిండుతుందని, తద్వారా ఆయకట్టు సాగు సాఫీగా సాగుతుందని భావించిన అన్నదాతలు బోర్లు,బావులు,చెరువులపై ఆధారపడి వేసిన పంటలు వరుణుడు కరుణించక, వరద పోటెత్తక భానుడి ప్రతాపానికి ఎండిపోయి రైతన్న కంట కన్నీరు మిగిలింది.
గత ఐదేళ్లలో సాగర్ నీటి విడుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.2018-19 ఖరీఫ్ సీజన్లో సాగర్ డ్యామ్ నీటి మట్టం 562 అడుగులు (238.
47టీఎంసీలు) ఉండగా ఆగస్టు 24న నీటి విడుదల చేశారు.2019-20 లో 556 అడుగులు (223.
19 టీఎంసీలు)ఉండగా ఆగస్టు 12 న నీటి విడుదల చేశారు.2020-21లో 587 అడుగులు(305.
62 టీఎంసీలు) ఉండగా ఆగస్టు 08 న నీటి విడుదల చేశారు.2021-22 లో 587 అడుగులు (305.
62 టీఎంసీలు) ఉండగా ఆగస్టు 02 న నీటి విడుదల చేశారు.2022-23 లో 552 అడుగులు (215.
98 టీఎంసీలు) ఉండగా జూలై 29 న నీటి విడుదల చేశారు.2023-24 లో పరిస్థితి మొత్తం తలకిందులైంది.
ప్రస్తుత సాగర్ నీటి మట్టం 590 అడుగులకు గాను 520.40అడుగులు(312 టీఎంసీలగాను 150 టీఎంసీలు)మరో పది అడుగులు తగ్గితే కనీస నీటి మట్టం 510 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరనుంది.
సాగర్ లో అందుబాటులో ఉన్న పది అడుగులు కూడా తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
దీంతో త్వరలోనే డెడ్ స్టోరేజీకి సాగర్ నీటి మట్టం చేరవచ్చు.సాగర్ ప్రాజెక్టు కింద తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో మొత్తం 22,35, 910 ఎకరాల ఆయకట్టు ఉండగా,ఎడమకాలువ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ,ఖమ్మం జిల్లాల పరిధిలో 5.
50లక్షల ఎకరాల సాగవుతుంది.నల్లగొండ,సూర్యాపేట జిల్లాల పరిధిలో 3.
50 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది.ఇప్పటికే కొంతమంది నాట్లు వేశారు,కొందరు నారు బోసుకుని సాగర్ నీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెలవెల బోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వైట్ హౌస్‌లో సాక్స్ పంచాయితీ.. జేడీ వాన్స్‌ను ఆటపట్టించిన ట్రంప్.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!