ఆ బాలీవుడ్ రీమేక్ కోసం యంగ్ డైరెక్టర్ ని ట్రై చేస్తున్న కింగ్

కింగ్ నాగార్జున ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో జోనర్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజం చూపిస్తే ప్రేక్షకులు తనని పెద్దగా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉండవని గ్రహించి డిఫరెంట్ కంటెంట్ కథలకి ఒకే చెబుతున్నాడు.

తనకి కరెక్ట్ గా సరిపోయే కంటెంట్ బేస్ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్నాడు.హీరోయిన్ కూడా కూడా ఏదో నామమాత్రంగా ఉండే విధంగా చూసుకుంటున్నాడు.

డ్యూయెట్స్ జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయిపోయాడు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నాగార్జున ఓ ఎన్ఎస్జీ కమాండోగా కనిపించనున్నాడు.ఇదిలా ఉంటే దీని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మళ్ళీ ఓ కాప్ స్టోరీనే చేయడానికి నాగార్జున ఒకే చెప్పాడు.

మరో వైపు బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ మీద కూడా నాగార్జున మనసు పడ్డాడు.

హిందీలో వచ్చిన రైడ్ చిత్రం రీమేక్ లో నటించాలని భావిస్తున్నారు.అయితే దీనికి సీనియర్ దర్శకులు కాకుండా యంగ్ డైరెక్టర్ చేతికి అప్పగించాలని చూస్తున్నాడు.

ఎవర్నైనా తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారట.ప్రస్తుతం ఆ దిశగా యంగ్ డైరెక్టర్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకుడుతో ఈ రీమేక్ చేస్తాడా లేక కొత్త దర్శకుడుని పరిచయం చేస్తాడా అనేది మాత్రం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాలి.

మరో వైపు మల్టీ స్టారర్ కథలు చేయడానికి కూడా నాగార్జున ఆసక్తి చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త దర్శకులు చెప్పిన ఇంటరెస్టింగ్ కథలు కూడా విన్నట్లు తెలుస్తుంది.

వాటిలో కొన్ని కథలని హోల్డ్ లో పెట్టడం జరిగిందని సమాచారం.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?